'త్వరలోనే 28 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు'

Notifications for filling 28 thousand jobs soon.. Says Minister Harish Rao. రెండు మూడు రోజుల్లో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ వస్తుందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. రాబోయే వారం రోజుల్లో 28 వేల ఉద్యోగాల

By అంజి  Published on  1 Sep 2022 8:32 AM GMT
త్వరలోనే 28 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

రెండు మూడు రోజుల్లో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ వస్తుందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. రాబోయే వారం రోజుల్లో 28 వేల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఇక ఏడాదిలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. సంగారెడ్డిలో పింఛనుదారులకు స్మార్ట్​ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడారు. పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని అంటున్న బీజేపీ సర్కార్‌.. వ్యాపారులకు మాత్రం వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తోందని విమర్శించారు.

నిత్యావసర వస్తువుల ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం పేదలపై భారం మోపిందన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1000 దాటిందని, దీంతో సామాన్యులు గ్యాస్‌ను కొనుక్కోలేని పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.2016 పెన్షన్‌ ఇస్తోందన్నారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం రూ.600 మాత్రమే పింఛన్‌ ఇస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికిపైగా లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు.

'త్వరలోనే 28 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు'ఒంటరి వారికి పింఛను, బియ్యం భరోసా ఇస్తున్నామని హరీష్‌ రావు వెల్లడించారు. ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారన్నారు. రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తామని చెప్పిన హామీని నెరవేర్చామని అన్నారు. .సొంత స్థలంలో ఇళ్లు కట్టుకోవడానికి సర్కార్‌ రూ.3 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని దసరా పండుగకు ప్రారంభిస్తామని మంత్రి హరీష్‌ రావు చెప్పారు.

Next Story