అలర్ట్‌.. గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల

గిరిజన, బీసీ, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2025 - 26 విద్యా సంవత్సరం 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.

By అంజి  Published on  20 Dec 2024 6:49 AM GMT
Class 5 Admissions, Gurukulm,TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TGREIS

అలర్ట్‌.. గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: గిరిజన, బీసీ, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2025 - 26 విద్యా సంవత్సరం 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. విద్యార్థులు రేపటి నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ పెట్టుకోవచ్చు. రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఫోన్‌ నంబర్‌తో ఒక దరఖాస్తు చేయాలి. అభ్యర్థికి బదులుగా వేరేవారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేస్తే అలాంటి వారిపై సెక్షన్ 416 ఆఫ్ IPC 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపడతారు. పాత జిల్లా యూనిట్‌గా ఎంపిక ఉంటుంది. ఫిబ్రవరి 23వ తేదీన ఎంట్రన్స్‌ ఎగ్జామ్ ఉంటుంది. వివరాలను 040 - 23391598, 9491063511 నంబర్లను సంప్రదించండి.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆయా శాఖల వెబ్‌సైట్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి ఈ లింకును అనుసరించందడి. https://tgswreis.telangana.gov.in . ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో ప్రవేశాలకు ఈ లింకును అనుసరించండి. https://tgtwreis.telangana.gov.in/ మహాత్మ జ్యోతిరావ్‌ పూలే బీసీ వెల్ఫేర్‌ పాఠశాలల్లో ప్రవేశాలకు https://mjptbcwreis.telangana.gov.in, ప్రభుత్వ ప్రవేశాల నోటిఫికేషన్ కోసం https://tgcet.cgg.gov.in/TGCETWEB/ ఈ లింక్‌లను అనుసరించండి.

Next Story