నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కరోనా వైరస్ పంజా విసిరింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల భగత్‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే ఇతర టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వైరస్ వేగంగా వ్యాప్తి చెందినట్లు సమాచారం.
ఇదిలావుంటే.. సాగర్ నియోజకవర్గంలో ఒక్కరోజే 160 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. టీఆర్ఎస్ నేతలతో పాటు.. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన చాలా మంది నాయకులు కరోనా బారిన పడినట్టు సమాచారం. ఇక సాగర్ నేతలు కరోనా బారిన పడ్డారనే వార్త తెలియడంతో.. ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న పలువురు నేతలు స్వతహాగా హోమ్ క్వారంటైన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో.. కార్యకర్తలకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.