ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసిన నోముల భ‌గ‌త్‌

Nomula Bhagath oath as MLA in Assembly.నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో గెలుపొందిన నోముల భ‌గ‌త్ గురువారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2021 12:25 PM IST
ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసిన నోముల భ‌గ‌త్‌

నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో గెలుపొందిన నోముల భ‌గ‌త్ గురువారం ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి భ‌గ‌త్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును భగత్ కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు జగదీష్ రెడ్డి, మ‌హ‌మూద్ అలీ, త‌ల‌సాని శ్రీయివాస్ యాద‌వ్ తో పాటు భ‌గ‌త్ కుటుంబ స‌భ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హఠాన్మరణంతో ఆ నియోజకవర్గానికి గత ఏప్రిల్‌ 17న ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో దివంగత నరసింహయ్య కుమారుడు నోముల భగత్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిపై భారీ మెజారిటీ(18వేల పై చిలుకు ఓట్ల‌)తో భగత్‌ విజయం సాధించారు.

Next Story