హైదరాబాద్‌లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వాహన చట్టాన్ని పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు వ్యతిరేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 2 Jan 2024 10:42 AM GMTహైదరాబాద్‌లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వాహన చట్టాన్ని పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు వ్యతిరేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మెకు దిగారు. ఫలితంగా.. పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. హైదరాబాద్లోని పలు పెట్రోల్ బంకుల్లో ఇవే బోర్డులు కనిపిస్తున్నాయి. దాంతో.. పెట్రోల్ లభిస్తోన్న బంకుల వద్దకు వాహనదారులు భారీ ఎత్తున క్యూకడుతున్నారు. త్వరగా స్టాక్ అయిపోతుండటంతో.. నో స్టాక్ బోర్డులు పెడుతూ యాజమాన్యాలు బంక్‌లను మూసివేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆయా బంకుల వద్ద రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. చాలా దూరం వరకు పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భారతీయ న్యాయసంహిత-2023 మోటారు వాహనాల హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ డీజిల్, పెట్రోల్ ట్యాంక్‌లను నిలిపివేశారు. నూతన చట్టం డ్రైవర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ 200 ట్యాంకర్లను నిలిపివేసి లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. సమ్మె చేస్తున్నారు. సోమవారం నుంచే లారీ డ్రైవర్లు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ద్వారా.. తీవ్రమైన రోడ్డుప్రమాదాన్ని కలిగించి, పోలీసులు, పరిపాలనాలోని ఏ అధికారికి సమాచారం ఇవ్వకుండా పారిపోయిన డ్రైవర్లకు గరిష్టం 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు.. రూ.7లక్షల జరిమానా విధించాలని చట్టాన్ని తెచ్చింది. ఇదే జీవోను రద్దు చేయాలని పెట్రోల్, డీజిల్ ట్యాంకర్స్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లా నగర శివారులోని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, ఉప్పర్‌పల్లిలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ ఎక్కువగా ఉంది.