తెలంగాణ రాష్ట్రంలోకి నో ఎంట్రీ అంటున్నారే..!

No Entry In Telangana. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు, రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలను అసలు అనుమతించడం లేదు.

By Medi Samrat  Published on  24 May 2021 9:06 AM GMT
no entry to telangana
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ముఖ్యంగా వాహనాల రాకపోకల విషయంలో అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలోనూ, తెలంగాణ లోని పలు పట్టణాల్లో పెద్ద ఎత్తున పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలను అసలు అనుమతించడం లేదు.


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-తెలంగాణ సరిహద్దు వద్ద క‌ట్టుదిట్టంగా త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. కర్నూలు నగర శివారులోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కూడా తెలంగాణ పోలీసులు త‌నిఖీలు చేస్తున్నారు. తెలంగాణలోకి ఈపాస్ లేకుండా వస్తోన్న‌ వారిని వెనక్కి పంపిస్తున్నారు. మరోసారి ఈ పాస్ లేకుండా వస్తే వాహనం సీజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. దీంతో చాలామంది వాహనదారులు వేరే అవకాశం లేకపోవడంతో వెనుదిరుగుతూ ఉన్నారు.


Next Story