తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు.. ఎల్లుండి చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందన్నారు. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి సుమారు 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుందన్నారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 48 గంటలలో దక్షిత ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో ఈ రోజు క్రింది స్థాయి గాలులు ముఖ్యంగా తూర్పు దిశ నుండి వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో వాతావరణం చలిగా ఉంటుంది.