Fastag Payments: ఫారెస్టు ఎంట్రీ పాయింట్ల దగ్గర్ ఫాస్టాగ్ సిస్టమ్.!
త్వరలోనే ఫారెస్టు ఎంట్రీ పాయింట్ల దగ్గర ఫాస్టాగ్ బేస్‌డ్ పేమెంట్స్ వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో
By అంజి Published on 17 April 2023 3:30 AM GMTFastag Payments: ఫారెస్టు ఎంట్రీ పాయింట్ల దగ్గర్ ఫాస్టాగ్ సిస్టమ్.!
త్వరలోనే ఫారెస్టు ఎంట్రీ పాయింట్ల దగ్గర ఫాస్టాగ్ బేస్‌డ్ పేమెంట్స్ వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌కు చెందిన అధికారులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అనుబంధ సంస్థ ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ అవగాహన ఒప్పందం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే వాహనాలకు ఇబ్బందిలేని, సమర్థవంతమైన ప్రవేశ ప్రక్రియను సులభతరం చేయడానికి మార్గం సుగమం చేస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చొరవ ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. టైగర్ రిజర్వ్‌లోని వివిధ ప్రవేశ ద్వారం వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా ఎకోసిస్టమ్ మేనేజ్‌మెంట్ కోఆర్డినేషన్ (EMC) రుసుమును వసూలు చేస్తారు.
ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్ టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ టోల్ చెల్లింపులను ప్రారంభించడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికతను ఉపయోగిస్తుంది. భారతదేశం అంతటా అన్ని ఫోర్-వీలర్‌లు, భారీ వాహనాలపై ఫాస్ట్‌ట్యాగ్‌ని అతికించడం తప్పనిసరి. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపులను ప్రారంభించడం ద్వారా, సందర్శకులు సుదీర్ఘ క్యూలు, జాప్యాలను నివారించవచ్చు, ఈ ప్రాంతాలలోని సహజ సౌందర్యం, వన్యప్రాణులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కి చెందిన IHMCL, అటవీ శాఖ మధ్య ఈ భాగస్వామ్యం సుస్థిర పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో, అటవీ ప్రవేశ కేంద్రాల వద్ద వాహనాల ఉద్గారాలను అరికట్టడం ద్వారా సహజ వనరులను సంరక్షించడంలో ఒక ముఖ్యమైన అడుగు.