మేడారంలో బాలికపై అత్యాచారం ఆరోపణలు..జాతీయ మహిళా కమిషన్ కీలక ప్రకటన
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో ఓ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని జాతీయ మహిళా కమిషన్ ప్రాథమిక విచారణలో తేలింది
By - Knakam Karthik |
మేడారంలో బాలికపై అత్యాచారం ఆరోపణలు..జాతీయ మహిళా కమిషన్ కీలక ప్రకటన
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో ఓ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని జాతీయ మహిళా కమిషన్ ప్రాథమిక విచారణలో తేలింది. మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఏర్పాటు చేసిన విచారణ కమిటీ, గురువారం తెలంగాణలోని ములుగు జిల్లాలో పర్యటించింది. ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు డెలినా ఖోంగ్‌దుప్ నేతృత్వంలోని ఈ బృందం, ములుగు కలెక్టరేట్‌లో కలెక్టర్ టి.ఎస్. దివాకర, ఎస్పీ రామ్‌నాథ్ కేకన్‌లతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకుంది.
అనంతరం, అత్యాచారం జరిగినట్లుగా ప్రచారమైన మేడారం జాతర పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రాథమిక విచారణలో భాగంగా, జాతరలో అలాంటి దురదృష్టకర సంఘటన ఏదీ జరగలేదని నిర్ధారణకు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. జాతర సమయంలో 13 ఏళ్ల బాలికపై ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ వార్తలు రావడంతో జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. పోలీసుల నుంచి పూర్తిస్థాయి లిఖితపూర్వక నివేదిక అందిన తర్వాత, ఈ కమిటీ తన తుది నివేదికను జాతీయ మహిళా కమిషన్‌కు సమర్పించనుంది.
#WATCH | Mulugu, Telangana: Member, NCW, Kanchan Khattar, says, "We have come here for an inquiry into the incident where it was reported that a minor girl was gang raped during the Jatra. We have met the deputy collector and the SP concerned, and they have informed us that this… https://t.co/32e0cv95TZ pic.twitter.com/IXGDTEIH1p
— ANI (@ANI) February 6, 2026