Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఏఎస్పీ భుజంగరావుకు బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న ఏఎస్పీ భుజంగరావుకు ఆగస్టు 19వ తేదీ సోమవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

By అంజి
Published on : 19 Aug 2024 8:30 AM

Nampally Court, interim bail, former ASP Bhujanga Rao, cardiac treatment

Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఏఎస్పీ భుజంగరావుకు బెయిల్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న ఏఎస్పీ భుజంగరావుకు ఆగస్టు 19వ తేదీ సోమవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతని గుండె ఆపరేషన్‌ చికిత్సకు సంబంధించి, అతని మునుపటి వైద్య చరిత్రను సమర్పించిన తర్వాత తదుపరి చికిత్స కోసం భుజంగ రావుకు 15 రోజుల బెయిల్ మంజూరు చేయబడింది.

తెలంగాణలో అధికారాన్ని నిలుపుకోవడానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కు సహాయం చేసేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, అతని కుటుంబం, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్ వ్యక్తులతో సహా రాజకీయవేత్తల ఫోన్‌లను ట్యాప్ చేయడానికి కుట్ర చేసిన పోలీసు అధికారుల బృందంలో భాగమైన ఆరోపణలపై భుజంగరావు మార్చి 23 నుండి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

విచారణ అనంతరం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, డీఎస్పీ ర్యాంక్ అధికారి ప్రణీత్ రావు, ఏఎస్పీ భుజంగరావు, తిరుపతన్న, ప్రాంతీయ మీడియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ శ్రవణ్ కుమార్ సహా ఆరుగురు నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ప్రభాకర్, కుమార్ పరారీలో ఉన్నారు.

నిందితుల్లో నలుగురు ఐదు నెలలుగా జైలులో ఉన్నారు. వారి బెయిల్ పిటిషన్లు పదేపదే తిరస్కరించబడ్డాయి. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం, భుజంరావుకు బెయిల్ మంజూరు చేస్తూ మొదటి అదనపు సెషన్స్ జడ్జి షరతులు విధించారు. నిందితుడు GHMC పరిమితిని దాటకూడదన్నది ఇందులో ఒకటి.

Next Story