చెర‌కు సుధాక‌ర్‌కు బెదిరింపులు : ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డిపై కేసు న‌మోదు

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి పై న‌ల్ల‌గొండ వ‌న్‌టౌన్ పోలీసులు కేసు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2023 6:47 AM GMT
MP Komatireddy Venkat Reddy

కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి పై న‌ల్ల‌గొండ వ‌న్‌టౌన్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయ‌న కుమారుడు సుహాస్ లు త‌మ‌ను కోమ‌టి రెడ్డి వెంక‌ట్‌రెడ్డి బెదిరించాడ‌ని ఫిర్యాదు చేయ‌డంతో ఐపీసీ 506 సెక్ష‌న్ కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ కు కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కాల్ చేసిన ఆడియో వైరల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. తనపై విమర్శలు మానుకోవాలని కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తన అభిమానులు, కార్యకర్తలు చెరుకు సుధాకర్ ను చంపేందుకు వంద కార్లలో తిరుగుతున్నారని బెదిరించారు. సోష‌ల్ మీడియాలో ఈ ఆడియో సంభాషణ వైర‌ల్‌గా మార‌గా దీనిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న వివరణ ఇచ్చారు. భావోద్వేగంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేశాన‌ని, ఈ విష‌యాన్ని ఇక్కడితో ఆపేయాల‌ని కోమ‌టిరెడ్డి కోరారు.

తన కొడుకుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడడంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి నిన్న చెరుకు సుధాకర్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలకు లేఖ రాశారు. బెదిరింపులపై చెరుకు సుధాకర్, ఆయన కొడుకు సుహస్ లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story