సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభ‌మ‌య్యింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. మొత్తం 25 రౌండ్స్ లలో లెక్కింపు జ‌రుగ‌నుండ‌గా.. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. అయితే.. పోస్ట‌ల్ బ్యాలెట్‌, మొద‌టి రౌండ్‌ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్ధి ఆధిక్యంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. తొలిరౌండ్‌లో టీఆర్ఎస్ కు 4228 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 2753 ఓట్లు వ‌చ్చాయి. టీఆర్ఎస్ అభ్య‌ర్ధి నోముల భ‌గ‌త్ తొలిరౌండ్‌లో 1450 లీడ్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. మొద‌ట‌గా నియోజ‌క‌వ‌ర్గంలోని గుర్రంపోడ్ మండలం ఓట్లు లెక్కిస్తారు. తరువాత పెద్దవురా, తిరుమలగిరి సాగర్, అనుముల మండలం, నిడమనూరు, మడుగులపల్లి, త్రిపురారం మండలాల ఓట్లు లెక్కించ‌నున్నారు.


సామ్రాట్

Next Story