నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. 15 రౌండ్లు పూర్తి.. ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్

Nagarjuna sagar assembly election results.నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 15వ రౌండ్ పూర్తి అయ్యే స‌రికి ఆ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 9,914 ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 May 2021 7:24 AM GMT
Nomula Bhagath

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ దూసుకెలుతోంది. 15వ రౌండ్ పూర్తి అయ్యే స‌రికి ఆ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 9,914 ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబు‌ళ్లపై లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలు ఉండ‌డంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తి‌కా‌నుంది. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది.

తొలి తొమ్మిది రౌండ్ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించ‌గా, 10, 11, 14వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

రౌండుల వారిగా..

- తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు వ‌చ్చాయి.

- రెండో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3,854, కాంగ్రెస్‌కు 3113 ఓట్లు వ‌చ్చాయి.

- మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోల‌య్యాయి.

- నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వ‌చ్చాయి.

- ఐదో రౌండ్‌టో టీఆర్ఎస్‌కు 3,442, కాంగ్రెస్ కు 2676, బీజేపీకి 74 ఓట్లు పోల‌య్యాయి.

- ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3,989, కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు వ‌చ్చాయి.

- ఏడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 4,022, కాంగ్రెస్ పార్టీకి 2,607 ఓట్లు వ‌చ్చాయి

- ఎనిమిది రౌండ్లో టీఆర్ఎస్‌కు 3, 249, కాంగ్రెస్ పార్టీకి 1,893 ఓట్లు పోల‌య్యాయి.

- తొమ్మిదో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,205, కాంగ్రెస్‌కు 2,042 ఓట్లు వ‌చ్చాయి.

- ప‌దో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,991, కాంగ్రెస్‌కు 3,166 ఓట్లు పోల‌య్యాయి.

- ప‌ద‌కొండో రౌండ్‌లో టీఆర్ఎస్ కు 3,395, కాంగ్రెస్ పార్టీకి 2,225 ఓట్లు వ‌చ్చాయి.

- ప‌న్నెండో రౌండ్‌లో టీఆర్ఎస్ కు 3833, కాంగ్రెస్ కు 2578 ఓట్లు పోల‌య్యాయి.

- ప‌ద‌మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3,766 ఓట్లు, కాంగ్రెస్ కు 3546 ఓట్లు వ‌చ్చాయి.

- 14వ రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 2,734 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 3,817 ఓట్లు పోల‌య్యాయి.

-15వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3203, కాంగ్రెస్ కు 2787 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నికల అధికారులు ప్ర‌క‌టించారు.



Next Story