మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ షురూ.. పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

Munugode By Election Results 2022 Counting Of Votes Began.మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2022 9:01 AM IST
మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ షురూ.. పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

అంద‌రూ ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న గిడ్డంగులశాఖ గోడౌన్‌లో లెక్కింపు కొనసాగుతోంది. మొద‌ట‌గా పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కించారు. టీఆర్ఎస్‌కు నాలుగు ఓట్ల ఆధిక్యం ల‌భించింది. టీఆర్ఎస్‌కు 228, బీజేపీ 224, బీఎస్పీ 10, ఇత‌రుల‌కు 88 ఓట్లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈవీఎంల లెక్కింపు కొన‌సాగుతోంది.

21 టేబుళ్లపై ఏకకాలంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. 298 పోలింగ్‌ కేంద్రాలు ఉన్న మునుగోడు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 15 రౌండ్లలో పూర్తి కానుంది. మధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు ఓట్ల లెక్కింపు పూర్తి కానుందని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక ఈనెల 3న జరగగా రికార్డు స్థాయిలో 93.13శాతం పోలింగ్‌ నమోదైంది. 2,41,805 ఓట్లకుగాను మొత్తం 2,25,192 ఓట్లు పోలయ్యాయి.

Next Story