మునుగోడు: ఈ యాప్ తో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు

Munugode by-election.. ECI operationalizes cVigil app, asks people to report MCC violations. మునుగోడు ఉప ఎన్నికలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘిస్తే సాధారణ ప్రజలు కూడా ఫిర్యాదు చేయవచ్చు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2022 1:22 PM IST
మునుగోడు: ఈ యాప్ తో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు

మునుగోడు ఉప ఎన్నికలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘిస్తే సాధారణ ప్రజలు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులు చేయడానికి cVigil యాప్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) తీసుకుని వచ్చింది. cVigil యాప్ ప్రస్తుతం AppStore, PlayStore రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుండగా.. నవంబర్ 6న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎంతో మంది నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడుతూ ఉన్నారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు 21 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. పోలీసులు రూ. 2.95 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ 123 కేసులు నమోదు చేసి 55 మందిని అరెస్టు చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రవర్తనను భారత ఎన్నికల సంఘం తెలుసుకుంటూ ఉంటుంది. అభ్యర్థుల ప్రవర్తనా నియమావళి కూడా చూస్తూ ఉంటారు. ప్రధానంగా ప్రసంగాలు, పోలింగ్ రోజు, పోలింగ్ బూత్‌లు, ఎన్నికల మానిఫెస్టోలు, ఊరేగింపులు వంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. రాజకీయ కార్యక్రమాలు నిర్వహించాలంటే అనుమతి తప్పనిసరి అని నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారి ఒకరు 'న్యూస్‌మీటర్‌'కి తెలిపారు. అనుమతి తీసుకోకుండా కార్యక్రమాలు చేపడితే కేసులు నమోదు చేయవచ్చని తెలిపారు.

ఇక ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల భౌగోళిక సరిహద్దుల్లో మాత్రమే యాప్ అందుబాటులో ఉంటుంది. ఎన్నికలు ప్రకటించిన రాష్ట్రంలోని భౌగోళిక సరిహద్దుల్లో నివసించే ఎవరైనా, ప్రతి ఒక్కరూ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడానికి అర్హులు. ఇందులో అభ్యర్థులతో పాటు, రాజకీయ పార్టీల సభ్యులు కూడా ఉన్నారు. లాగిన్ అయిన తర్వాత, మీరు మీ ఫిర్యాదును అనామకంగా కూడా తెలియజేయవచ్చు.. కావాలంటే యూజర్ గా కూడా నమోదు చేసుకొని ఫిర్యాదులు చేయవచ్చు. యాప్ అత్యంత ఖచ్చితమైన లొకేషన్‌ను రికార్డ్ చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది.. ఆ ఫిర్యాదును వెంటనే ECI, జిల్లా ఎన్నికల అధికారికి ఫార్వార్డ్ చేస్తుంది. ఇందులో ఫిర్యాదుకు సంబంధించి ఫోటో తీయవచ్చు లేదా 2 నిమిషాల వీడియోను రికార్డ్ చేయవచ్చు. ఫోటో లేదా వీడియోను యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.. ఆడియోను కూడా రికార్డ్ చేయవచ్చు. నల్గొండ జిల్లాలో గత 30 రోజుల్లో 8 కేసులు నమోదయ్యాయని యాప్‌ ద్వారా తెలుస్తోంది.

"ఎవరైనా ఫిర్యాదును నివేదిస్తే.. ఆ సమాచారం జిల్లా కంట్రోల్ రూమ్‌కు పంపుతారు. అక్కడ అది ఫీల్డ్ యూనిట్‌కు కేటాయించబడుతుంది" అని జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారి న్యూస్‌మీటర్‌తో అన్నారు. ఫీల్డ్ యూనిట్ లో ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు, రిజర్వ్ టీమ్‌లు ఉంటారు. ప్రతి ఫీల్డ్ యూనిట్‌లో 'cVIGIL ఇన్వెస్టిగేటర్' అనే GIS-ఆధారిత మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, ఇది ఫీల్డ్ యూనిట్ నేరుగా ఆ స్థానానికి చేరుకోవడానికి వీలవుతుంది. "ఫీల్డ్ యూనిట్ లొకేషన్ కు చేరుకోవడానికి, ఫిర్యాదును ధృవీకరించడానికి ఒక గంట సమయం ఉంటుంది. విచారణ ఆధారంగా, అవసరమైన చర్యలు తీసుకుంటారు," అని అధికారి న్యూస్‌మీటర్‌కి తెలిపారు. చిత్రాన్ని తీసిన తర్వాత లేదా వీడియోను రికార్డ్ చేసిన తర్వాత, cVIGIL వినియోగదారు సంఘటనను నివేదించడానికి 5 నిమిషాల సమయం ఉంటుంది. ముందుగా రికార్డ్ చేసిన చిత్రాలు/వీడియోలను అప్‌లోడ్ చేయడానికి లేదా ఈ యాప్ నుండి క్లిక్ చేసిన ఫోటోలు/వీడియోలను నేరుగా ఫోన్ గ్యాలరీలో సేవ్ చేయడానికి యాప్ వినియోగదారులను అనుమతించదు. అన్ని ఫిర్యాదులపై రిటర్నింగ్ అధికారి తుది నిర్ణయం తీసుకుంటారు. మునుగోడు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణా రెడ్డి వ్యవహరిస్తున్నారు.

డబ్బు పంపిణీ, బహుమతి/కూపన్ పంపిణీ, మద్యం పంపిణీ, అనుమతి లేకుండా పోస్టర్లు/బ్యానర్‌లు, తుపాకీల ప్రదర్శన, బెదిరింపులు, అనుమతి లేకుండా వాహనాలు లేదా కాన్వాయ్‌లు తీసుకుని రావడం, ఆస్తి ధ్వంసం, ఎన్నికల రోజు ఓటర్ల రవాణా, పోలింగ్ బూత్‌కు 200 మీటర్ల లోపు ప్రచారం చేయడం, నిషేధిత కాలంలో ప్రచారం చేయడం, మతపరమైన లేదా మతపరమైన ప్రసంగాలు/సందేశాలు, స్పీకర్ల వినియోగం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు.

Next Story