తెలంగాణ వాహనదారులకు శుభవార్త.. ఇక ఆ యాప్‌లోనే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌లు

తెలంగాణలో రవాణా శాఖ సేవలు మరింత సులభతరం కానున్నాయి. నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్స్‌ తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియను 'వాహన్' (VAHAN) పోర్టల్ ద్వారా...

By -  అంజి
Published on : 11 April 2026 7:09 AM IST

VAHAN Portal Update, mParivahan App Download, Temporary Registration Certificate, Driving License Digital Copy, Vehicle Dealer Training, Transport Department Digitization, Non-transport Vehicle Registration

తెలంగాణ వాహనదారులకు శుభవార్త.. ఇక ఆ యాప్‌లోనే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌లు 

తెలంగాణలో రవాణా శాఖ సేవలు మరింత సులభతరం కానున్నాయి. నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్స్‌ తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియను 'వాహన్' (VAHAN) పోర్టల్ ద్వారా రవాణా శాఖ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నూతన విధానం ద్వారా ఇప్పటివరకు సుమారు 33,000 తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు జారీ అయ్యాయి. వాహనదారులకు మరింత సౌలభ్యం కలిగిస్తూ, ఏప్రిల్ 11 నుండి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లను (DLs) నేరుగా 'ఎమ్-పరివాహన్' (mParivahan) యాప్ నుండి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.

గత నెల 23న తెలంగాణ రవాణా శాఖను వాహన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌తో అనుసంధానం చేశారు. ఈ ప్రక్రియ మార్చి 23 నుండే కార్యరూపం దాల్చిందని, దీనిపై సుమారు 1,000 మంది వాహన డీలర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు రవాణా శాఖ వెల్లడించింది. వీరిలో 671 మంది డీలర్లు ఇప్పటికే వాహన్ పోర్టల్ ద్వారా సేవలు అందించేందుకు అధికారిక అనుమతులు పొందారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ దరఖాస్తులను ఎటువంటి జాప్యం లేకుండా, సమర్థవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనివల్ల వాహన కొనుగోలుదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డిజిటల్ పద్ధతిలో సేవలను పొందవచ్చు.

Next Story