బుల్లెట్ బండి పాట‌కు ఎంపీ మాలోత్ కవిత డ్యాన్స్.. వైరల్

MP Maloth Kavitha Dance in a Wedding Ceremony.శ్రావ‌ణ మాసం కావ‌డంతో ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2021 5:16 AM GMT
బుల్లెట్ బండి పాట‌కు ఎంపీ మాలోత్ కవిత డ్యాన్స్.. వైరల్

శ్రావ‌ణ మాసం కావ‌డంతో ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది. కాగా.. ఇటీవ‌ల ఓ పెళ్లి కుమారై వివాహం అనంత‌రం నిర్వ‌హించిన బరాత్ లో నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా అనే ఫోక్ సాంగ్ కు చేసిన డ్యాన్స్ విప‌రీతంగా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆమె చేసిన డ్యాన్స్‌కు సామాన్యుల‌తో పాటు సెలబ్రెటీలు కూడా ఫిదా అయ్యారు. ఇక ఈ పాట జ‌నాల‌ను ఓ ఊపు ఊపుతోంది. ప్ర‌స్తుతం ఏ పెళ్లి వేడుక‌లోనైనా ఈ పాటనే వినిపిస్తోంది. తాజాగా.. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత ఈ పాట‌కు చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నేత ముత్యం వెంకన్న గౌడ్ కుమారుడి పెళ్లి వేడుక జ‌రిగింది. ఈ వేడుక‌కు ఎంపీ మాలోతు కవిత హాజరయ్యారు. వివాహం అనంత‌రం నూతన వధువరూలను ఆశీర్వదించారు. తర్వాత బుల్లెట్ పాట మోత మోగింది. ఇంకేముంది.. ఎంపీ కూడా స్టెప్పులు వేశారు. వ‌ధూవ‌రుల‌తో క‌లిసి నృత్యం చేస్తూ.. అందరినీ ఉత్సాహ పరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it