యోగా వల్ల శరీరం, మనస్సు అదుపులో ఉంటాయి: సీఎం శివరాజ్‌

MP CM Shivraj singh chouhan couple visited Kanha shanti vanam.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన కన్హ శాంతివనంలో జరిగిన

By అంజి  Published on  30 Oct 2022 11:27 AM GMT
యోగా వల్ల శరీరం, మనస్సు అదుపులో ఉంటాయి: సీఎం శివరాజ్‌

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన కన్హ శాంతివనంలో జరిగిన సహజ యోగా కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. సీఎం వెంట ఆయన భార్య సాధనా సింగ్‌ కూడా ఉన్నారు. శివరాజ్‌ సింగ్‌ ఇక్కడ వాటర్‌ హార్వెస్టింగ్‌ సిస్టమ్‌తో కూడాన నాణ్యమైన రోడ్ల సాంకేతికతను అర్థం చేసుకున్నారు. అలాగే హార్ట్‌ఫుల్‌నెస్‌ సెంటర్‌ను పరిశీలించారు. సీఎం శివరాజ్‌సింగ్‌ మాట్లాడుతూ.. ''నిన్న రాత్రి కన్హా శాంతి వనాన్ని సందర్శించే అవకాశం మాకు లభించింది.'' అని అన్నారు.

యోగా, ధ్యానం అలవరుచుకోవడం వల్ల చక్కలి ఫలితాలు వస్తాయన్నారు. ధైర్యం, సహనశీలత, ప్రేమ అలవడతాయని పేర్కొన్నారు. రామచంద్రమిషన్‌ అందిస్తున్న సేవలు అమోఘమని సీఎం శివరాజ్‌ కొనియాడారు. సహజ్‌మార్గ్‌ ఆధ్యాత్మిక సంస్థ ఆహ్వానం మేరకు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హాశాంతి వనాన్ని సీఎం శివరాజ్‌ సందర్శించారు. ప్రఖ్యాత యోగా గురువు కమలేష్‌ పటేల్‌ దాజీతో కలిసి శివరాజ్‌ దంపతులు గంటపాటు ధ్యానం చేశారు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం, రామచంద్రమిషన్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌ సెంటర్‌లు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని చెప్పారు.
Next Story