'కేదార్ మృతిపై అనుమానం'.. సెంట్రల్ మినిస్టర్‌కు ఎంపీ చామల లేఖ
దుబాయ్‌లో తెలుగు సినీ నిర్మాత సెలగంశెట్టి కేదార్ మృతిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
By అంజి Published on 4 March 2025 12:08 PM IST
'కేదార్ మృతిపై అనుమానం'.. సెంట్రల్ మినిస్టర్‌కు ఎంపీ చామల లేఖ
దుబాయ్‌లో తెలుగు సినీ నిర్మాత సెలగంశెట్టి కేదార్ మృతిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. సినీ నిర్మాత కేదార్ బాబు మృతిపై వినతి పత్రాన్ని ఇచ్చారు. సినీ నిర్మాత కేదార్ బాబు మృతిపై విచారణ చేయించాల్సిందిగా కోరారు. అతని మరణంపై కొందరు అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు.
"ఫిబ్రవరి 24న మరణించిన కేదార్ బాబుకు సంబంధించి కేంద్ర ఏజెన్సీల నుండి విచారణ కోరుతున్నాను. మేము విన్నట్లుగా ఇది అనుమానాస్పద మరణం. గతంలో వారి పదవీకాలంలో ఆయన బీఆర్‌ఎస్ నాయకులతో సంబంధం కలిగి ఉన్నారు. అప్పుడే ఆయన పెద్ద వ్యాపారవేత్త అయ్యాడు. ఈ వ్యక్తి ద్వారా చాలా మనీలాండరింగ్ జరిగిందని మాకు అనుమానం ఉంది. ఆయన మరణించినప్పుడు, కొంతమంది బీఆర్‌ఎస్ నాయకులు దుబాయ్‌లో ఉన్నారు... అక్కడ సరిగ్గా ఏమి జరిగిందో మేము అర్థం చేసుకోవాలనుకుంటున్నాము. అందుకే కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయడానికి బాధ్యత ఉంది, అందుకే నేను ఆయనకు లేఖ రాశాను'' అని లేఖలో పేర్కొన్నారు.
పది రోజుల క్రితం దుబాయ్ లో సినీ నిర్మాత కేదార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కేదార్ మరణం పై ఎలాంటి అనుమానాలు లేవని దుబాయ్ పోలీసులు తేల్చి చెప్పారు. కేదార్ ది సహజ మరణమే అని పోలీసులు తెలిపారు. భారత ప్రభుత్వ అనుమతితో కేదార్ భార్యకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. దుబాయ్ లోనే కేదార్ మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.