తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకోవడం లేదు : ఎంపీ అరవింద్
MP Arvind About Sharmila Party. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్.. వైఎస్ షర్మిల నూతన పార్టీ వార్తలపై స్పందిచారు.
By Medi Samrat Published on
11 Feb 2021 10:32 AM GMT

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్.. వైఎస్ షర్మిల నూతన పార్టీ వార్తలపై స్పందిచారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెంలగాణలో సిస్టర్ షర్మిల పార్టీ పెడతామంటూ హడావుడి చేస్తున్నారని.. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యాన్ని కోరుకోవడం లేదని.. రామరాజ్యం కోరుతున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
షర్మిలా పార్టీ ఇంకా పుట్టలేదని.. పార్టీ పెట్టాక వారు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారో చూస్తామన్న ఆయన.. ఆరోగ్యశ్రీ జమానా అయిపోయిందని.. ఇప్పుడు ఆయుస్మాన్ భారత్ జమానా వచ్చిందన్నారు. తెలంగాణలో అవినీతికి తావులేదని, నరేంద్రమోదీ యొక్క క్లీన్ గవర్నెన్స్ మాత్రమే తెలంగాణ ప్రజలకు కావాలని.. బ్రదర్ అనిల్ సతీమణి సిస్టర్ షర్మిలకు చెబుతున్నానని అరవింద్ అన్నారు. ఒక వేళ షర్మిల పార్టీ పెడితే శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు అరవింద్ వ్యాఖ్యానించారు.
Next Story