చెరువులో తల్లి, రెండేళ్ల చిన్నారి మృత‌దేహాలు

Mother and daughter dead bodies in pond.నారాయణపేట జిల్లా ఉట్కూరు మండ‌లంలో విషాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sep 2021 8:00 AM GMT
చెరువులో తల్లి, రెండేళ్ల చిన్నారి మృత‌దేహాలు

నారాయణపేట జిల్లా ఉట్కూరు మండ‌లంలో విషాదం చోటు చేసుకుంది. తిమ్మారెడ్డి ప‌ల్లి తండా చెరువులో త‌ల్లి, రెండేళ్ల చిన్నారి మృత‌దేహాల‌ను స్థానికులు గుర్తించారు. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను చెరువులోంచి బ‌య‌ట‌కు తీయించారు. మృత‌దేహాల‌ను ప‌రిశీలించి అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం నారాయ‌ణ‌పేట ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఆత్మ‌హ‌త్య లేదా హ‌త్య చేశారా అన్న కోణంలో విచార‌ణ చేస్తున్నారు. మృతుల వివ‌రాలు తెలిస్తేనే కేసు చిక్కుముడి వీడే అవ‌కాశాలు ఉన్నాయి.

Next Story
Share it