గవర్నర్‌ తమిళిసై తీరు బాధాకరం: ఎమ్మెల్సీ కవిత

రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీల ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్ తమిళిసై తీరు బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

By Srikanth Gundamalla  Published on  26 Sept 2023 12:12 PM IST
MLC Kavitha,  Governor Tamilisai, Telangana,

గవర్నర్‌ తమిళిసై తీరు బాధాకరం: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో ప్రభుత్వం వర్సెస్‌ రాజ్‌భవన్‌ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలకు సర్కార్ గవర్నర్‌ను ఆహ్వానించకపోవడం.. ఆ తర్వాత ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ తిరస్కరించడం జరుగుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించింది. దాంతో.. మరోసారి రాజ్‌భవన్‌, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోందని స్పష్టం అవుతోంది. అయితే.. ఈ అంశంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.

రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీల ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్ తమిళిసై తీరు బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గవర్నర్ వ్యవహారం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని కవి అన్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉందని చెప్పారు. ఆ క్రమంలోనే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తే గవర్నర్‌ ఎందుకు ఆపుతున్నారనంటూ కవిత ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వర్గాకలు పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రస్తావించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అసెంబ్లీ హాల్‌లో ఎమ్మెల్సీ కవిత నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగానే గవర్నర్‌ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్ ఆమోదించడం సంప్రదాయం అని.. దానికి విరుద్ధంగా సర్కార్‌ పంపిన పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా బీజేపీ రాజ్యాంగా నడుస్తుందా అని క్వశ్చన్ చేశారు. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలకు పరిధులు, పరిమితులు ఉంటాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అయితే.. బీజేపీ మరోసారి బీసీ వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుందని.. ప్రజలు ఇవన్నీ గమనించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కోరారు.

Next Story