ఆ రాముడు మ‌న‌కెందుకు..? విరాళాలు ఇవ్వొద్దు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే

MLA Vidyasagar Rao controversial comments on Ram mandir donation drive.అయోధ్య రామాల‌యానికి విరాళాలు ఇవ్వొద్దంటూ కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్ రావు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2021 9:44 AM GMT
MLA Vidyasagar Rao controversial comments on Ram mandir donation drive

అయోధ్య రామాల‌యానికి విరాళాలు ఇవ్వొద్దంటూ కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్ రావు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు‌. నియోజ‌క‌వ‌ర్గంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న అయోధ్య రామాల‌యానికి విరాళాలు ఇవ్వొద్దంటూ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాముడు మనకెందుకు.. మన దగ్గర రాముడి ఆలయాలు లేవా? అంటూ ప్రశ్నించి.. కొత్త వివాదానికి తెరలేపారు. అంతేకాదు.. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. రాముని పేరు మీద భిక్షం ఎత్తుకుంటున్నారని, కొత్త నాటాకనికి తెర లేపుతున్నారంటూ వ్యాఖ్యానించారు. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులా..? అని ప్రశ్నించిన ఆయన.. తామంతా శ్రీరాముని భక్తులమేనని చెప్పుకొచ్చారు.

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో హిందువులపై టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. ఇప్పుడు విద్యాసాగర్‌రావు వ్యాఖలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇక అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. భ‌క్తులు నుంచి సేక‌రించిన విరాళాల‌తోనే ఆల‌యాన్ని నిర్మించాల‌ని త‌ల‌పెట్టారు. అందులో భాగంగానే ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా విరాళాల సేక‌ర‌ణ కొన‌సాగుతోంది. తెలంగాణలోనూ ఈ నెల 20వ తేదీ నుంచి ఈ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.




Next Story