ప్రజల మధ్యనే ఉంటా.. ప్రజల మధ్యే చచ్చిపోతా : తాటికొండ రాజయ్య

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో

By Medi Samrat  Published on  25 Aug 2023 6:11 PM IST
ప్రజల మధ్యనే ఉంటా.. ప్రజల మధ్యే చచ్చిపోతా : తాటికొండ రాజయ్య

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే..! ఇటీవల సీఎం కేసీఆర్ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం టిక్కెట్‌ను ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించడంతో రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టిక్కెట్ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, కేసీఆర్ చెప్పినట్లుగా నడుచుకుంటానని అన్నారు.

ఇక కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నేను ప్రజల మధ్యనే ఉంటాను.. ప్రజల మధ్యే చచ్చిపోతా అన్నారు. ఆరునూరైనా తాను ప్రజాజీవితంలోనే ఉంటానని చెప్పారు. నాగలితో దున్ని పంటలు పండించే వరకు కష్టపడి, రాసి పోసిన తర్వాత ఎవరో వస్తానంటే ఊరుకుంటానా? అంటూ వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్నందరినీ కాపాడుకుంటానని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. మనకు దేవుడు ఉన్నాడు. దేవుడిలాంటి కేసీఆర్ ఉన్నాడన్నారు. మనం అనుకున్నది రేపో, మాపో జరగొచ్చని అన్నారు.

Next Story