సీఎం కేసీఆర్‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పిన సీత‌క్క‌.. ఈ పుట్టినరోజు సంద‌ర్భంగానైనా..

MLA Seethakka Wish CM KCR On His Birthday. ములుగు ఎమ్మెల్యే సీత‌క్క..‌ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

By Medi Samrat  Published on  17 Feb 2021 3:32 PM IST
MLA Seethakka Wish CM KCR On His Birthday.

ములుగు ఎమ్మెల్యే సీత‌క్క..‌ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ భ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన ఆమె సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్ష‌లు తెల‌ప‌డంతో పాటు.. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కాంక్షించారు. ఈ సంద‌ర్భంగా.. 2016లో సీఎం కేసీఆర్ తన పుట్టినరోజు సంద‌ర్భంగా ములుగు జిల్లాను ప్రకటించారు. కానీ.. ఎటువంటి నిధులు కేటాయించలేదు. పరిపాలన భవనాలు నిర్మించలేదు.

జిల్లా అయితే అభివృద్ధి చెందుతుందని భావించాం.. కానీ గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా ములుగు అలానే ఉందని అన్నారు సీత‌క్క‌. ఈ పుట్టినరోజు సంద‌ర్భంగా అయినా.. ములుగు జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సీత‌క్క సీఎంను కోరారు. అలాగే.. పోడు భూములకు పట్టాలిస్తామని గతంలో సీఎం అనేక సంధర్భాలలో చెప్పారు. ఇప్పటి వరకు ఓక్క ఎకరా పోడు భూమికి కూడా పట్టా ఇవ్వలేదు. అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారని.. హామీల‌ను నెర‌వేర్చి సీఎం మాట నిలుపుకోవాని సీత‌క్క అన్నారు. ‌


Next Story