బ్రేకింగ్: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ రద్దుచేసిన బీజేపీ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసింది బీజేపీ.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 6:00 AM GMTబ్రేకింగ్: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ రద్దుచేసిన బీజేపీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఇప్పటి వరకు ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఈ క్రమంలోనే సస్పెన్షన్‌ను రద్దు చేస్తున్నట్లు బీజేపీ డిసిప్లినరీ కమిటీ ప్రకటన జారీ చేసింది.
వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 23న రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆ పార్టీ ఆదేశించింది. దీంతో రాజాసింగ్ తన వివరణ ఇచ్చారు. వివరణను పరిగణనలోకి తీసుకున్న బీజేపీ.. తాజాగా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర క్రమశిక్షణ సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్ ఓ ప్రకటన విడుదల చేశారు.
తొలి జాబితా విడుదల చేసే ముందే రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్‌ను బీజేపీ రద్దు చేస్తుందని ప్రచారం జరిగింది. అంతేకాదు.. మొదటి జాబితాలోనే రాజాసింగ్ పేరు కూడా ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. 2018 ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజాసింగ్ విజయం సాధించారు. బీజేపీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా రాజాసింగ్ నిలిచారు. సస్పెన్షన్ ఉన్న నేపథ్యంలో ఈ సారి బీజేపీ నుంచి పోటీ చేస్తారా లేదా అనే ఉత్కంఠ కొంత మేరకు ఉండింది. రాజాసింగ్ కూడా తాను బీజేపీ నుంచి మాత్రమే పోటీ చేస్తానని.. లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేతతో ఆయన బీజేపీ తరఫున మరోసారి బరిలోకి దిగునున్నారనే దానిపై క్లారిటీ వచ్చింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్‌ను రద్దు చేసిన బీజేపీ ప్రవక్తపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గతంలో రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ తాజాగా ఆ సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ బీజేపీ డిసిప్లినరీ కమిటీ ప్రకటన pic.twitter.com/fu4x3rvh2G
— Newsmeter Telugu (@NewsmeterTelugu) October 22, 2023