నా జోలికి వస్తే వారిని కాల్చి పడేస్తా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తన జోలికి వస్తే కాంగ్రెస్‌ వాళ్లను కాల్చిపడేస్తా అన్నారు.

By Srikanth Gundamalla  Published on  28 Aug 2023 10:15 AM GMT
MLA Marri Janardhan, Viral Comments, Congress,

నా జోలికి వస్తే వారిని కాల్చి పడేస్తా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలయ్యింది. బీఆర్ఎస్‌ ఇప్పటికే 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దాంతో.. టికెట్‌ దక్కించుకున్న వారు ప్రజల్లోకి వెళ్తున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అయితే.. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు మరోసారి తమని గెలిపించాలని.. అభివృద్ధిని కొనసాగిస్తామని చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదంటూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తన జోలికి వస్తే కాంగ్రెస్‌ వాళ్లను కాల్చిపడేస్తా అంటూ వివాదాస్పదంగా మాట్లాడారు.

నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గంలోని తెల్కపల్లి మండలంలో "పదేళ్ల ప్రజా ప్రస్థానంలో మర్రన్న" పాదయాత్ర సందర్భంగా జనార్దన్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. నాగర్‌కర్నూల్‌ బీఆర్ఎస్‌ టికెట్‌ను మర్రి జనార్థన్‌రెడ్డి సీఎం కేసీఆర్ కేటాయించారు. దాంతో.. ఆయన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. కాంగ్రెస్ నేతలు తన జోలికి వస్తే ఒక్కొక్కరిని కాల్చి పడేస్తానన్నారు. కాంగ్రెస్‌ నేతలను గ్రామాల్లో తిరగకుండా చేస్తానని మర్రి జనార్థన్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాను తలుచుకుంటే కాంగ్రెస్‌ చేయి ఊడిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం రాత్రి ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి మాట్లాడుతున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఫైర్ అయ్యారు. తాను తలుచుకుంటే కాంగ్రెస్‌ నేతలు గ్రామాల్లో కూడా తిరగలేరని మండిపడ్డారు. తన కోపాన్ని తట్టుకోలేరంటూ.. కాల్చి పడేస్తా అని తిట్ల పురాణం అందుకున్నారు. నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అక్కడున్నవారంతా షాక్‌ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకులు మండిపడుతున్నారు.

Next Story