కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారు: అరికెపూడి గాంధీ
తెలంగాణలో రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 13 Sept 2024 5:14 PM ISTతెలంగాణలో రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. ఇద్దరి మధ్య వాగ్వివాదం.. ప్రాంతీయ విభేదాల వరకు వెళ్లింది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ఈ సవాళ్ల పర్వం కొనసాగింది. తాజాగా అరికెపూడి గాంధీ మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నాని అన్నారు. కేసీఆర్‌ను కలిసేది తన వ్యక్తిగత విషయం అని చెప్పారు. అయితే.. పాడి కౌశిక్ రెడ్డి విద్వేషాలను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు అరికెపూడి గాంధీ. కౌశిక్ రెడ్డి రౌడీయిజం చేయడానికి దేనికి అని ప్రశ్నించారు.
కౌశిక్‌రెడ్డి ఇప్పుడే కాదు గతంలో కూడారెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అరికెపూడి గాంధీ మండిపడ్డారు. మహిళలను అవమానించేలా కౌశిక్‌రెడ్డి మాట్లాడారన్నారు. చీర, గాజులు గురించి మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అన్నారు. అంతేకాదు.. కౌశిక్‌రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చారని.. తీరు మార్చుకోవాలి అని అరికెపూడి గాంధీ హితవు పలికారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు కౌశిక్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. రెచ్చగొట్టినందునే తాను మాట్లాడాల్సి అలా మాట్లాడాల్సి వచ్చిందనీ చెప్పుకొచ్చారు. కేసీఆర్ అంటే తనకు గౌరవమే అన్నారు. కౌశిక్‌రెడ్డి తీరుతో కేసీఆర్ గతంలో చేసిన సేవలకు చెడ్డపేరు వస్తుందని... నోరు అదుపులోలేని మనిషిని ఊరు మీదకు వదిలేశారు అరికెపూడి గాంధీ కామెంట్స్ చేశారు.
ఇక కౌశిక్ రెడ్డి భాషను కేసీఆర్, హరీశ్ రావు సమర్ధిస్తారా అని ప్రశ్నించారు అరికెపూడి గాంధీ. వారు ఆయన కామెంట్స్ ను సమర్ధిస్తే తాను సమర్ధిస్తానని అన్నారు. తాను నోరు జారింది కూడా వాస్తవమే అని ఎమ్మెల్యే అంగీకరించారు. అక్రమ సంపాదనపై కౌశిక్ చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి లాంటి వారి వలనే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందంటూ అరికెపూడి గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. అయితే.. తన ఇంటిపై జెండా ఎగుర వేయడానికి కౌశిక్ రెడ్డి ఎవరు? ప్రభుత్వాన్ని డిస్ట్రబ్ చేసేందుకే ప్రయత్నాలంటూ అరికెపూడి గాంధీ వ్యాఖ్యానించారు.