కారులోంచి తల బయటకు పెట్టిన చిన్నారి.. డ్రైవర్‌ కారు అద్దం లేపడంతో..

సూర్యాపేట జిల్లాలో తొమ్మిదేళ్ల బాలిక కారులో నుంచి తల బయటకు పెట్టి చూస్తున్న సమయంలో.. డ్రైవర్‌ ఒక్కసారిగా కారు అద్దం లేపాడు.

By అంజి
Published on : 23 May 2023 2:30 PM IST

Minor died, car window, Suryapet district

కారులోంచి తల బయటకు పెట్టిన చిన్నారి.. డ్రైవర్‌ కారు అద్దం లేపడంతో..

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో తొమ్మిదేళ్ల బాలిక కారులో నుంచి తల బయటకు పెట్టి చూస్తున్న సమయంలో.. డ్రైవర్‌ ఒక్కసారిగా కారు అద్దం లేపాడు. దీంతో చిన్నారి మెడ కారు అద్దం మధ్యలో ఇరుక్కుని మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం బొజ్జగూడెం గ్రామంలో వివాహ వేడుకలో జరగగా, మంగళవారం వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బాణోత్ ఇంద్రజ వధూవరులతో కలిసి వెనుక సీటులో పాటలు పాడుతూ, నృత్యం చేసింది. ఈ సమయంలోనే ఆమె కారు బయటకు తల పెట్టి చూసింది.

ఇది గమనించకుండా డ్రైవర్ పవర్ విండో స్విచ్‌ను నొక్కాడు. బాలిక మెడ ఇరుక్కుపోవడంతో ఊపిరాడటం నిలిచిపోయి మృతి చెందింది. వివాహ వేడుక ముగిసిన తర్వాత, వధూవరులను తీసుకువెళ్లిన కారు వేదిక నుండి బయలుదేరుతుండగా, వరుడి బంధువు అయిన అమ్మాయి వెనుక సీట్లో కూర్చుంది. బాలిక తండ్రి బాణోత్ వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కారు డ్రైవర్ శేఖర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో బొజ్జగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story