తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ గ్రామ సభల అనంతరం జనవరి 26 నుంచి అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అలాగే గ్రామ సభల్లో చేసినా పేరు రాలేదని అభద్రతకు గురికావొద్దన్నా ఆయన, రేషన్ కార్డులు రాని వారు మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు. గ్రామ సభల వద్ద ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వివిధ పథకాలకు అప్లికేషన్ చేసుకున్న అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని, పథకాలు పొందేందుకు ఎలాంటి పైరవీ అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు మొదటగా, స్థలం ఉన్న అర్హులకే ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.