సన్న బియ్యం ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి దేనని.. ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏటా 14,560 కోట్లు సన్న బియ్యం కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. సన్న బియ్యంతో పేదలకు కడుపునిండా భోజనం పెట్టే ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఎంత భారమైన పేదలకు మేలు చేయాలని ఆలోచనతో ఉన్నామన్నారు. జనం తినే ఆహారమే అందించాలనేది మా ఆలోచన అన్నారు. 86% జనాభాకు సన్న బియ్యం అందుతున్నాయని పేర్కొన్నారు.
సోనియా గాంధీ తెచ్చిన ఫుడ్ సెక్యూరిటీ బిల్లుకు తెలంగాణలో న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు మా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ. 40,000 కోట్లు వేసిందని తెలిపారు. ధాన్యం కొన్న 48 గంటల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకు మూడు కోట్ల 39 లక్షల మంది సన్నబియ్యం లబ్ధిదారులున్నారని.. అడిగిన అందరికీ రేషన్ కార్డులను ఇస్తున్నామని తెలిపారు.