అంతకంటే గౌరవమైన పదవి ఉండదు : మంత్రి తలసాని

Minister Talasani Srinivasa Yadav. టీఆర్ఎస్‌ కార్యకర్త అంటేనే గౌరవమైన పదవి.. అంతకంటే గౌరవమైన పదవి ఉండదని ఆ పార్టీ నేత‌

By Medi Samrat  Published on  27 Nov 2022 5:30 PM IST
అంతకంటే గౌరవమైన పదవి ఉండదు : మంత్రి తలసాని

టీఆర్ఎస్‌ కార్యకర్త అంటేనే గౌరవమైన పదవి.. అంతకంటే గౌరవమైన పదవి ఉండదని ఆ పార్టీ నేత‌, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గ‌డిచిన 8 ఏళ్లలో నామినేట్ పోస్టులు రాలేదని కొంతమంది అసంతృప్తులు ఉండడం సహజం.. సందర్భాన్ని బట్టి అవకాశం మన ఇంటికి వస్తుంది.. అధైర్యపడొద్దని సూచించారు. 8 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేశాం.. సంక్షేమ పథకాలు చేపట్టామ‌ని అన్నారు.

గుజరాత్ లో బీజేపీ బ్రహ్మండంగా పనులు చేస్తే నరేంద్రమోదీ వందసార్లు ఎందుకు తిరుగుతున్నారని ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు ఆత్మీయ సమావేశం నిర్వ‌హించామ‌ని అన్నారు. ఆత్మీయ‌ సమావేశాల్లో ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని పిలుపునిచ్చారు. మొన్నటివరకు మునుగోడులో గద్దల్లా తిరిగారు.. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా.. ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త మాత్రమే తిరుగుతున్నారని అన్నారు.

ఎవరి తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భ‌యపడదని.. టీఆర్ఎస్‌ నేతలను ఇబ్బందిపెట్టే ప్రయత్నం జరుగుతుందని వ్యాఖ్యానించారు. 2, 3 రోజుల్లో ఆత్మీయ సమ్మేళనాల తేదీలు ప్రకటిస్తాం.. సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తాం అని తెలిపారు.

పదవి రాలేదనే ఆవేదన ఉంటుంది.. అవకాశం వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. హైదరాబాద్ టీఆర్ఎస్‌ అడ్డా అని నొక్కి చెప్పారు. మంత్రి మల్లారెడ్డి పట్ల ఐటీ అధికారులు అనైతికంగా ప్రవర్తించారని విచారం వ్య‌క్తం చేశారు. సమయం అందరికి వస్తుంది.. రేపు మీ పరిస్థితి వచ్చినప్పుడు అలాగే జరుగుతుందని.. కుస్తీ పోటీలు పెట్టినట్లు చేస్తే మేం రెడీ అని స‌వాల్ విసిరారు. ఆత్మీయ సమేళనాల తర్వాత నిజాం కాలేజిలో భారీ సమావేశం ఏర్పాటుచేస్తాం అని తెలిపారు.


Next Story