ఆ మర్డర్ వెనుక ఎవ్వరు ఉన్నా వదిలి పెట్టేది లేదు : మంత్రి శ్రీధర్ బాబు

జగిత్యాల మర్డర్ దురదృష్టకరమ‌ని మంత్రి శ్రీధర్ బాబు విచారం వ్య‌క్తం చేశారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  23 Oct 2024 4:42 PM IST
ఆ మర్డర్ వెనుక ఎవ్వరు ఉన్నా వదిలి పెట్టేది లేదు : మంత్రి శ్రీధర్ బాబు

జగిత్యాల మర్డర్ దురదృష్టకరమ‌ని మంత్రి శ్రీధర్ బాబు విచారం వ్య‌క్తం చేశారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. జగిత్యాల ఘ‌ట‌న‌ను ఖండించారు. జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సీనియర్ కాంగ్రెస్ నేత కావడంతో జీవన్ రెడ్డి బాధలో ఉన్నారన్నారు. గంగారెడ్డి కుటుంబానికి అండగా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. హ‌త్య ఘ‌ట‌న‌పై విచారణ జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డీజీపీకి, జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చామని వెల్ల‌డించారు. పార్టీ పరంగా సమన్వయం చేయాలని పీసీసి అధ్యక్షుడు నాకు చెప్పారు.. జీవన్ రెడ్డితో నేను మాట్లాడానని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జీవన్ రెడ్డి కోరారని.. జగిత్యాల మర్డర్ వెనుక ఎవ్వరు ఉన్నా వదిలి పెట్టేది లేదన్నారు.

అంత‌కుముందు ఆయ‌న మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివ‌చ్చారు. జీవో నెంబర్ 46 తో ఇబ్బందులు పడుతున్న పోలీస్ అభ్యర్థులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. సీఎస్ తో మాట్లాడిస్తా. అపాయింట్మెంట్ ఇప్పిస్తా మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని హామీ ఇచ్చారు. వికలాంగులు, వీఆర్ఏ, డీఎస్సీ అభ్యర్థులు, తదితర సంఘాల ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తులు అందజేశారు.

Next Story