IAS స్మితా సబర్వాల్ కామెంట్స్‌పై మంత్రి సీతక్క సీరియస్
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా పెడుతున్న పోస్టులు దేశవ్యాప్తంగానే సంచలనంగా మారాయి.
By Srikanth Gundamalla
IAS స్మితా సబర్వాల్ కామెంట్స్‌పై మంత్రి సీతక్క సీరియస్
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా పెడుతున్న పోస్టులు దేశవ్యాప్తంగానే సంచలనంగా మారాయి. దివ్యాంగుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను చాలా వరకు తప్పుబడుతున్నారు. కొందరు మాత్రం ఆవిడ చెప్పింది కరెక్టే కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు. సీరియస్ అయ్యారు. అంగవైకల్యం కంటే బుద్ది వైకల్యం చాలా ప్రమాదకరమంటూ వ్యాఖ్యానించారు మంత్రి సీతక్క. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దివ్యాంగుల కోటా కామెంట్లను తప్పుబట్టారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మంత్రి సీతక్క ఈ వ్యాఖ్యలు చేశారు.
అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం ప్రమాదకరమని మంత్రి సీతక్క అన్నారు. అంతా అవగాహన ఉందని మాట్లాడేవారు.. ఇతరుల అభిప్రాయాలను గుర్తించకపోవడం ఏమాత్రం సరికాదని చెప్పారు. అది వాళ్ల మానసిక వైకల్యమని అన్నారు. ఐపీఎస్‌కు ఫిజికల్ ఫిట్‌నెస్ అవసరం.. పోలీసులకు కలెక్టర్లకు తేడా తెలియదా అంటూ మత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఒక అదికారిణిగా ఉండి స్మితా సబర్వాల్ అలా మాట్లాడటం తప్పు అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని చెప్పారు. అయితే.. సుదరు అధికారిణి కామెంట్స్‌ను తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి సీతక్క తెలిపారు.
కాగా.. స్మితా సబర్వాల్ ఆమె చేసిన కామెంట్స్‌ను సమర్దించుకున్న విషయం తెలిసిందే. దానికి వివరణ కూడా ఇచ్చారు. ఎవరినీ కించపర్చాలనేది తన ఉద్దేశం కాదన్నారు. తన మాటలకు కట్టుబడి ఉన్నానన్నారు. దాంతో.. దివ్యాంగుల కోటాపై ఆమె చేసిన వ్యాఖ్యలపై మరింత దుమారం రేగుతోంది. నెటిజన్లతో పాటు ప్రజాప్రతినిధులు కూడా స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను తప్పబడుతున్నారు.