మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ఇంట తీవ్ర విషాదం

Minister Satyavathi Rathod Father passed away.తెలంగాణ రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2022 8:37 AM IST
మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ఇంట తీవ్ర విషాదం

తెలంగాణ రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మంత్రి సత్యవతి తండ్రి లింగయ్య నాయక్ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని తన నివాసంలో గురువారం తెల్ల‌వారుజామున క‌న్నుమూశారు. మంత్రి స‌త్య‌వతి రాథోడ్ మేడారం స‌మ్మ‌క్క-సార‌ల‌మ్మ మ‌హాజాత‌ర పర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆమె మేడారంలో ఉన్నారు. విష‌యం తెలిసిన వెంట‌నే మంత్రి హుటాహుటిన పెద్ద తండాకు బ‌య‌లుదేరారు. లింగయ్య నాయక్ మృతి పట్ల ప‌లువురు పార్టీ నేత‌లు సంతాపం తెలియ‌జేస్తున్నారు. కాగా.. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా పార్టీ శ్రేణులంతా సంబురాల్లో ఉండ‌గా.. మంత్రి ఇంట విషాదం చోటు చేసుకోవ‌డంతో అంద‌రినీ విషాదంలో ముంచెత్తింది.

Next Story