కిషన్ రెడ్డి కేసీఆర్‌కు బినామీ: పొన్నం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
By Medi Samrat
కిషన్ రెడ్డి కేసీఆర్‌కు బినామీ: పొన్నం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి రోజు అంటూ ప్రకటన వచ్చింది. జనవరి 6 వరకు ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆ తర్వాత కూడా దరఖాస్తులను మండల కేంద్రాల్లో ఇవ్వొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజా పాలన దరఖాస్తుల గడువుపై సంచలన ప్రకటన చేశారు. ప్రజా పాలన దరఖాస్తులు సమర్పించేందుకు జనవరి 6నే చివరి రోజని అన్నారు. జనవరి 6 వరకే గ్రామాల్లో శిబిరాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మళ్ళీ గడువు పొడిగింపు ఉండదంటూ పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. జనవరి ఆరు తర్వాత మండల కేంద్రాల్లో దరఖాస్తులను సమర్పించవచ్చని తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా గడపక ముందే బీఆర్ఎస్ నేతలు ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో అర్ధం కావడం లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒకటే అని.. కిషన్ రెడ్డి కేసీఆర్‌కు బినామీ అని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను రక్షించేందుకే కిషన్ రెడ్డి సీబీఐ విచారణ కోరుతున్నారని ఆరోపించారు.