Karimnagar: పొలం వద్ద మహిళా రైతులతో మంత్రి పొన్నం ముచ్చట్లు

కరీంనగర్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  10 Aug 2024 12:45 PM GMT
minister ponnam prabhakar, karimnagar, farmers,

Karimnagar: పొలం వద్ద మహిళా రైతులతో మంత్రి పొన్నం ముచ్చట్లు

కరీంనగర్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వెళ్తున్న దారిలో వ్యవసాయ పనులు చేస్తున్న మహిళా రైతుల వద్దకు వెళ్లారు. వారితో కాసేపు ముచ్చటించారు. వ్యవసాయ పనులు ఎలా జరుగుతున్నాయి? సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్‌ వెళ్తుండగా వెళ్తుండగా మార్గ మధ్యలో రైతులతో మాట్లాడారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోన్న రూ.2లక్షల రుణమాఫీ విషయాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులంతా తమకు బ్యాంకుల్లో ఉన్న రుణాలు మాఫీ అయ్యాయని మంత్రి పొన్నంతో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. ఆర్టీసి లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని మహిళా రైతులు చెప్పారు. పనుల కోసం ఈజీగా ఇతర గ్రామాలకు వెళ్తున్నామని చెప్పారు. ఉచిత బస్సు సదుపాయం వల్ల తమకు చాలా వరకు డబ్బు ఆదా అవుతోందని హర్షం వ్యక్తం చేశారు.

అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ అందుతుందా అని అక్కడున్న వారిని మంత్రి పొన్నం అడిగారు. తమకు జీరో బిల్లుతో విద్యుత్‌ను అందిస్తున్నందుకు పలువురు మంత్రి పొన్నంకు ధన్యవాదాలు తెలిపారు. రేషన్‌ కార్డులు, ఇల్లు మంజూరు చేయాలని పులువరు రైతులు మంత్రి పొన్నంను కోరగా.. ఆయన దానికి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రేషన్‌ కార్డులు అందిస్తామని.. అలాగే ఇందిరమ్మ ఇళ్లు కూడా వస్తాయని చెప్పారు. రైతులు, పేదల పట్ల తమ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని.. వారి అభివృద్ధి కోసమే పని చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.



Next Story