Telangana: టూరిజం స్పాట్‌గా మహా సముద్రం గండి.. అభివృద్ధికి ప్రణాళికలు

ప్రాచుర్యంలో లేకుండా పోయిన ప్రకృతి రమణీయ ప్రాంతాలను గుర్తించి.. వాటిని పర్యాటక ప్రదేశాలుగా మార్చేందుకు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది

By అంజి  Published on  24 Jun 2024 3:45 PM GMT
Minister Ponnam Prabhakar, Maha Samudram Gandi, tourism spot, Husnabad

Telangana: టూరిజం స్పాట్‌గా మహా సముద్రం గండి.. అభివృద్ధికి ప్రణాళికలు

ప్రాచుర్యంలో లేకుండా పోయిన ప్రకృతి రమణీయ ప్రాంతాలను గుర్తించి.. వాటిని పర్యాటక ప్రదేశాలుగా మార్చేందుకు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలోని ఉమ్మాపూర్ గ్రామ పరిధిలో గల అత్యంత ఆహ్లాదకరంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎతైన కొండ ప్రాంతాలను, గుట్టల మద్య ఉన్న మహాసముద్రాల గండి చెరువును జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరితో కలిసి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఎతైన గుట్టలను కలుపుతూ మధ్యలో ఉన్న చెరువును చూడడానికి చాలా మంది పర్యటకులు వస్తారని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ ప్రాంతాన్నంతటిని ఒక పెద్ద పర్యటక క్షేత్రంగా చేయడం కోసం టూరిజం శాఖ వారితో సమావేశం నిర్వహించి ప్రణాళికలు బద్ధంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.

ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాచురల్ గా కొండల నుండి వచ్చే జాలూ ద్వారా నిండే చెరువును చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం రోడ్డు నిర్మాణం, అలాగే చెరువు నుండి నీరు వదిలే తుము మార్గం , చెరువు నిండిన తర్వాత నీరు బయటకు వెళ్ళే మత్తడి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యాటక శాఖతో సమావేశం నిర్వహించి.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Next Story