మంత్రి మల్లారెడ్డి.. అప్పడప్పుడూ వివాదాలు చుట్టుముట్టుతున్నా అవన్ని పట్టించుకోకుండా ముందుకుపోయే సరదా మనిషి. ఆయన ఛలోక్తులు బాగా పేలుతాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డి.. బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లో 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా, పురుషుల కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కూడా నవ్వులు పూయించారు మంత్రి గారు.
అయితే.. క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు మంత్రి మల్లారెడ్డి.. కబడ్డీ ఆడేందుకు కోర్టులోకి వచ్చారు. కూతకు వెళ్లిన మల్లారెడ్డి ఒక్కసారిగా కాలుజారి క్రింద పడ్డారు. మంత్రి కిందపడటంతో అలర్టైన నేతలు, నిర్వహకులు పైకిలేపారు. ఎంతో ఉత్సాహంతో పైకి లేచిన మంత్రి నవ్వులు పూయించారు. అదృష్టవశాత్తు ఏలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్, కసాని జ్ఞానేశ్వర్, మెయర్లు బుచ్చిరెడ్డి, వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు లక్ష్మీ గౌడ్,శివ గౌడ్,జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సంజీవరెడ్డి, దయాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు కూడా పాల్గొన్నారు.