గొర్రెల కాపరి అవతారమెత్తిన మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి గొర్రెల కాపరిగా అవతారం ఎత్తారు. గొంగడి నెత్తిన కప్పుకుని గొర్రెల కాపరిగా మారారు.

By Srikanth Gundamalla  Published on  6 July 2023 3:05 PM IST
Minister Malla Reddy As shepherd Viral Video

గొర్రెల కాపరి అవతారమెత్తిన మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మాటలు, చేష్టలు సోషల్‌ మీడియాలో ఎప్పుడూ వైరల్‌ అవుతుంటాయి. ఆయన చెప్పే డైలాగ్స్‌ని సినిమాల్లో కూడా పెట్టే రేంజ్‌లో ఉంటాయి. పాలమ్మినా, పూలమ్మినా, కాలేజ్‌లు పెట్టినా ఈ డైలాగ్‌ అయితే నెట్టింట తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి మరో అవతారం ఎత్తారు. ఈసారి నెత్తిన గొంగడి కప్పుకుని.. గొర్రెలను కాస్తూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మేడ్చల్‌ జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. 15 మంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. ఆ తర్వాత గొర్రెల కాపరిగా వేషధారణ ధరించారు. యాదవుల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. కాసేపు పొలాల్లో గడ్డి మేస్తున్న గొర్రెలకు కాపలాగా నిలబడ్డారు. అక్కడే ఉన్న కొందరు ఈ తతంగాన్నంతా వీడియో తీశారు. అదే వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి మల్లారెడ్డి యాదవుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం యాదవులకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు.

Next Story