యువతి పాడిన ర్యాప్ సాంగ్‌కు ఫిదా అయిన మంత్రి కేటీఆర్ (వీడియో)
మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 11:14 AM ISTయువతి పాడిన ర్యాప్ సాంగ్‌కు ఫిదా అయిన మంత్రి కేటీఆర్ (వీడియో)
మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయ విమర్శలు అయినా సరే ఇతర పార్టీలకు కౌంటర్లు వేస్తుంటారు. అలాగే పలు విషయాలను ఎక్స్ (ట్విట్టర్) ద్వారా పంచుకుంటూ ఉంటారు. కొందరు నెటిజన్లు అయితే తమ సమస్యలు ఉంటే కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే ఆయన కూడా స్పందించిన తగిన సాయం చేస్తుంటారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ ఆసక్తిగా కనబడుతోంది. ఓ ఐటీ ఉద్యోగి తనను ఆపి మరి పాడిన ర్యాప్ సాంగ్‌ను ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.
ఆ యువతి పాడిన పాటకు మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. హైదరాబాద్ అంటేనే హైపర్ గా ఉంటాం!.. బిర్యాని తింటూనే ఇరానీ చాయ్ అంటాం. మనది హైద్రాబాదు.. దేశంలో మనమే జోరు.. మన కేటీఆరు.. ఇగ సూడర జోరు .. అంటూ అమ్మాయి ర్యాప్ సాంగ్ పాడింది. ఇంది సూపర్బ్ గా పాడిందంటూ ‘ఏంట్ దట్ స్వీట్ థ్యాంక్స్ @MirchiRJswathi’ అని రీ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. పాటకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ ‘కిరాక్ ర్యాప్’ అని కామెంట్ చేయగా, మరో నెటిజన్ ‘ఇది మన తెలంగాణ యాస’ అంటూ కామెంట్ చేశాడు. ఇంకొందరు మాత్రం పాటలో మరికొన్ని యాడ్ చేయాల్సిందంటూ అంటూ చురకలంటిస్తున్నారు. ఈ పాట మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Ain’t that sweet 😊 Thanks @MirchiRJswathi https://t.co/dFpnkfonIJ
— KTR (@KTRBRS) November 3, 2023