మంత్రి కేటీఆర్ సెటైరిక‌ల్ ట్వీట్‌.. 'అచ్చేదిన్ ఆగ‌యా బ‌దాయి హో'

Minister KTR tweet on cooking gas cylinder price hike.కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై తర‌చూ మంత్రి కేటీఆర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 July 2022 10:46 AM IST
మంత్రి కేటీఆర్ సెటైరిక‌ల్ ట్వీట్‌..  అచ్చేదిన్ ఆగ‌యా బ‌దాయి హో

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై తర‌చూ మంత్రి కేటీఆర్ విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సందిస్తుంటారు. ఈ క్ర‌మంలో నేడు సిలిండ‌ర్ పెంపు మంత్రి త‌న‌దైన శైలిలో స్పందించారు. 'మంచి రోజులు వ‌చ్చేశాయ్‌(అచ్చేదిన్ ఆగ‌యా).. అంద‌రికి శుభాకాంక్ష‌లు. వంటింటి గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ను కేంద్రం మ‌రో 50 పెంచింది. సిలిండ‌ర్ ధ‌ర పెంచి మ‌హిళ‌ల‌కు ప్ర‌ధాని కానుక ఇచ్చారు. 'అని కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

కాగా.. నేడు(బుధ‌వారం) గృహావసరాల కోసం వినియోగించే 14 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచాయి చ‌మురు కంపెనీలు. తాజా పెంపుతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్ సిలిండ‌ర్ ధర రూ.1105కు చేరగా, దేశ రాజ‌ధాని ఢిల్లీలో ధర రూ.1053కు పెరిగింది. దీంతో పాటు ఐదు కేజీల డొమెస్టిక్‌ సిలిండర్‌పై మరో రూ.18 పెంచేసింది.

Next Story