ఓట్లు కొనేందుకు కర్ణాటక నుంచి కాంగ్రెస్ వందల కోట్లు తెస్తోంది: కేటీఆర్

తెలంగాణలో ఓటర్లను ప్రలోభ పెట్టాలని కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

By Srikanth Gundamalla  Published on  13 Oct 2023 3:09 PM IST
Minister KTR, Tweet,  congress, bangalore, money seized,

 ఓట్లు కొనేందుకు కర్ణాటక నుంచి కాంగ్రెస్ వందల కోట్లు తెస్తోంది: కేటీఆర్

తెలంగాణలో ఎన్నిలకు షెడ్యూల్ వచ్చిన విషయం తెలిసిందే. దాంతో.. రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. మరోవైపు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీకి ప్రభుత్వ అధికారులు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తే.. ఇటీవల బెంగళూరు దొరికిన డబ్బులతో బీఆర్ఎస్‌కు ఆయుధం లభించినట్లు అయ్యింది. దాంతో.. కాంగ్రెస్‌ పార్టీ అక్రమంగా తెలంగాణకు డబ్బులు రవాణా చేసి ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా మంత్రి కేటీఆర్ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేశారు..

బెంగళూరులో ఓ ఫ్లాట్‌లో పరుపుల కింద దాచిపెట్టిన రూ.42 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ డబ్బులను తెలంగాణకు అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించారని.. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు ప్లాన్‌ చేశారని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆ సోదాలకు సంబంధించిన ఫోటోలను.. న్యూస్‌ను మంత్రి కేటీఆర్ రీట్వీట్‌ చేస్తూ ఇలా రాసుకొచ్చారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్‌ నేతలు దొరికారని మంత్రి కేటీఆర్ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు పెట్టారు. కర్ణాటక నుంచి తెలంగాణకు తరలుతున్న దాదాపు రూ.42 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారని పేర్కొన్నారు. ఓటుకు నోటు కుంభకోణంలో నాడు లంచం ఇస్తూ కెమెరాకు చెక్కి నేటీ కాంగ్రెస్‌ తెలంగాణ చీఫ్‌ దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నానడని విమర్శించారు. ఇది ఊహించినేదనని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కుంభకోణాలు చేసేవారికి చోటు ఉండదంటూ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. కాంగ్రెస్ వైఫల్యాలను.. కేంద్ర సర్కార్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. హ్యాట్రిక్‌ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచార వేగాన్ని మరింత పెంచేందుకు బీఆర్ఎస్‌ అధిష్టానం 54 నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించింది.

Next Story