నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌

Minister KTR tour in Rajanna Sircilla District Today.ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ నేడు(శుక్ర‌వారం) సిరిసిల్ల జిల్లా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2022 3:18 AM GMT
నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌

ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ నేడు(శుక్ర‌వారం) సిరిసిల్ల జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఎల్లారెడ్డిపేట‌, గంభీరావుపేట, సిరిసిల్లలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల‌ను చేయ‌నున్నారు.

మంత్రి కేటీఆర్ షెడ్యూల్ ఇదే..

- సిరిసిల్ల పట్టణంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి ఉద‌యం 11 గంట‌ల‌కు భూమి పూజ.

- ఉద‌యం 11.30 గంటలకు జిల్లా రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు.

- మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్‌లో జిల్లా న్యాయవాదులతో స‌మావేశం

- మధ్యాహ్నం 1.30 గంటలకు ఎల్లారెడ్డిపేటకు చేరుకుంటారు

- మధ్యాహ్నం 2.30 గంటలకు గంభీరావుపేటలో జగదాంబదేవీ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో పాల్గొంటారు.

- అనంతరం ముస్తాబాద్‌ మండలంలో యాదవ సంఘ భవనాన్ని ప్రారంభిస్తారు.

Next Story