కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వ‌ర్త‌న భ‌య‌పెట్టింది : మంత్రి కేటీఆర్‌

Minister KTR support to Kamareddy Collector.మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ జితేశ్ పాటిల్‌కు అండ‌గా నిలిచారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Sep 2022 4:54 AM GMT
కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వ‌ర్త‌న భ‌య‌పెట్టింది : మంత్రి కేటీఆర్‌

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ జితేశ్ పాటిల్‌కు అండ‌గా నిలిచారు. కామారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌తో కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వ‌ర్తించిన తీరు త‌న‌ను భ‌య‌పెట్టింద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ రాజ‌కీయ నాయ‌కులు క‌ష్ట‌ప‌డి పనిచేసే ఆల్ ఇండియా స‌ర్వీసెస్ అధికారుల‌ను నిరుత్సాహ‌ప‌రుస్తారని ఆరోపించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, గౌరవప్రదమైన ప్రవర్తనకు అభినందనలు తెలుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఏం జ‌రిగిందంటే..?

పార్ల‌మెంట్ ప్ర‌వాస్ యోజ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా శుక్ర‌వారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో ప‌ర్య‌టించారు. బీర్కూర్ మండ‌లం కేంద్రంలోని ఓ రేష‌న్ షాపు వ‌ద్ద ల‌బ్ధిదారుల‌తో సీతారామ‌న్ మాట్లాడుతూ.. ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నార‌ని అడిగి తెలుసుకున్నారు. రేష‌న్ బియ్యం ప‌థ‌కంలో కేంద్రం వాటా ఎంత‌..? రాష్ట్రం వాటా ఎంత‌..? ల‌బ్ధిదారుల వాటా ఎంత‌..? అంటూ జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆమె ప్ర‌శ్నించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌పై జిల్లా పాల‌నాధికారికి స్ప‌ష్ట‌త లేక‌పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇక్క‌డ ప్ర‌ధాని మోదీ ఫ్లెక్సీ ఎందుకు పెట్ట‌లేద‌ని మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ వ్య‌వ‌హారంపై మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియా వేదిక‌పై కేంద్ర మంత్రిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

Next Story