సెప్టెంబర్ 17 గురించి అమిత్ షా చెప్పేవన్నీ అబద్దాలే: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా జరుపుకోవడం లేదంటూ భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలకు ప్రతిగా

By అంజి  Published on  27 March 2023 11:45 AM IST
Minister KTR , Amit Shah, September 17

సెప్టెంబర్ 17 గురించి అమిత్ షా చెప్పేవన్నీ అబద్దాలే: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా జరుపుకోవడం లేదంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేస్తున్న ఆరోపణలకు ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా అధికారికంగా నిర్వహించిందని అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) గుర్తు చేసింది. ఆదివారం కర్నాటకలోని బీదర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం లేదని అన్నారు. నిజాం పాలనకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజల త్యాగాలను స్మరించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో దీనిపై స్పందించారు. ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం అయిన సెప్టెంబర్ 17 గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పేవన్నీ అబద్దాలే అని అన్నారు. కేంద్ర హోంమంత్రికి సమైక్యతా దినోత్సవం గురించి గుర్తు చేయడానికి కొన్ని వార్తల క్లిప్పింగ్‌లను పంచుకున్నారు. కేంద్ర హోం మంత్రి హోదాలో ఉండి.. ఇలాంటి అబద్దాలు ప్రచారం చేయడం, తప్పుదోవ పట్టించడం అలవాటుగా మారిందని అమిత్‌షాపై కేటీఆర్‌ మండిపడ్డారు. 1948లో హైదరాబాద్‌ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం అయినప్పటి నుంచి సెప్టెంబరు 17వ తేదీని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటోందని చెప్పారు.

Next Story