మంత్రి కేటీఆర్ పిలుపు.. వైరల్ ఐనా సిలిండర్ కో దండం

Minister KTR pilupu.తెలంగాణ‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ కొనసాగుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 March 2021 9:23 AM GMT
Call of Minister KTR

తెలంగాణ‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ కొనసాగుతోంది. ప్ర‌ముఖులు ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో షేక్‌పేటలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నాయని.. మేధావులు, విద్యావంతులు తమకు సరైన న్యాయం చేసేవారిని ఎన్నుకునే అవకాశం అన్నారు. ఎవరూ.. ఎలాంటి ప్రలోభాలకు లోను చేసినా సరైన ఆలోచనా దోరణి ఉన్నవారే ఓట్లు వేస్తారని.. అందుకే తమకు న్యాయం చేసేవారినే ఎన్నుకోవాలని అన్నారు.

ఇక ఉదయం ఇంట్లో బ‌య‌లుదేరే ముందు గ్యాస్ సిలిండ‌ర్‌కు న‌మ‌స్కారం పెట్టి వ‌చ్చి ఓటేశానని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా చెప్పారు. గ్యాస్ సిలిండ‌ర్‌, పెట్రోలు ధ‌ర‌లు పెరిగిపోతున్నాయ‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పారు. ప‌ట్టభ‌ద్రులంద‌రూ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయ‌న అన్నారు. ఆదివారం సెలవుదినమని ఇంట్లోనే ఉండ‌కూడ‌ద‌ని, ప్రతి ఒక్కరూ సాయంత్రం నాలుగు గంటల్లోగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు.

సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే తాను ఓటు వేశానని అన్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ పిలుపు మేరకు యువత అనూహ్యంగా స్పందిస్తున్నారు. ఇంట్లో నుంచి బయలు దేరుతున్న సమయంలో గ్యాస్ సిలిండర్ కి మొక్కుతున్నారు. అంతే కాదు చాలా చోట్ల పెట్రోల్ బంక్ ల్లో నిలబడి మరీ మొక్కుతున్నారు. అయితే కేటీఆర్ అన్న మాటల్లో భవిష్యత్ లో చమురు ధర మరింత పెరిగే అవకాశం ఉందని.. అది సామాన్యులకు మరింత భారం కాబోతుందని.. కేంద్రం తీరును చెప్పకనే తీవ్రంగా విమర్శిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి కేటీఆర్ పిలుపు మేరకు గ్యాస్ సిలిండర్లకు, పెట్రోల్ బంకులకు మొక్కి, ఓటేయడానికి వెళ్తున్న పట్టభద్రుల తీరు చూస్తుంటే ఈసారి కేంద్రంపై కస్సు బుస్సు అంటున్నట్లే కనిపిస్తుంది.




Next Story