మూసీ నదిపై ఎక్స్‌ప్రెస్‌వే, 14 బ్రిడ్జ్‌లు, సుందరీకరణ పనులు: మంత్రి కేటీఆర్

దేశంలోనే ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్‌కు ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.

By Srikanth Gundamalla  Published on  1 July 2023 2:46 PM IST
Minister KTR, Musi River, Hyderabad, Express Way, Bridges

మూసీ నదిపై ఎక్స్‌ప్రెస్‌వే, 14 బ్రిడ్జ్‌లు, సుందరీకరణ పనులు: మంత్రి కేటీఆర్

అలాగే మూసీ నది సుందరీకరణ పనులు చేపట్టామని.. మూసీపై బ్రిడ్జ్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్.

దేశంలోనే ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్‌కు ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. 100 శాతం మురుగునీటిని శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్‌ చరిత్ర సృష్టించబోతున్నదని తెలిపారు. మురుగునీటి శుద్ధి కోసం దాదాపు రూ.3,866 ఖర్చుతో కొత్తగా 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అలాగే మూసీ నది సుందరీకరణ పనులు చేపట్టామని.. మూసీపై బ్రిడ్జ్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్.

మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని తెలిపారు మంత్రి కేటీఆర్. త్వరలోనే వాటికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అయితే.. ఐదు టెండర్ల దశలో ఉన్నాయని అన్నారు. మూసీ నదిపై శంషాబాద్‌ నుంచి నాగోల్‌ వరకు 55 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మిస్తామని అన్నారు. దానికి రూ.15వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతేకాదు మూసీ నదిపై స్కైవే నిర్మిస్తామని చెప్పారు. కోవిడ్‌ వల్ల మూసీ సుందరీకరణ పనులు అనుకున్నంత వేగంగా చేయలేకపోయామన్నారు మంత్రి కేటీఆర్.

హైదరాబాద్‌లోని నార్సింగి వద్ద ఓర్‌ఆర్‌పై నిర్మించిన ఇంటర్‌ చేంజ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో ఇంటర్‌ చేంజ్‌ నిర్మించామని, ఓఆర్‌ఆర్‌పై ఇది 20వ ఇంటర్‌ చేంజ్‌ అన్నారు. త్వరలో మరొకటి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఔటర్‌పై స్పీడ్‌ లిమిట్‌ను 120 కిలోమీటర్లకు పెంచామని ఈ సందర్భంగా చెప్పారు మంత్రి కేటీఆర్. రెండున్నరేళ్లలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను పూర్తి చేస్తామని వెల్లడించారు.

Next Story