'మన ఊరు మన బడి' సీఎం కేసీఆర్ మానస పుత్రిక
Minister KTR inaugurates Gambhiraopet KG to PG Campus.'మన ఊరు - మన బడి' కార్యక్రమం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని
By తోట వంశీ కుమార్ Published on 1 Feb 2023 8:28 AM GMT'మన ఊరు - మన బడి' కార్యక్రమం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి కేటీఆర్ అన్నారు. గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను విద్యాశాఖ మంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రికేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఆ తరువాత క్యాంప్ మొత్తం తిరిగి అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీతో పాటు వివిధ విభాగాలను పరిశీలించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కేజీ నుంచి పీజీ వరకూ నాణ్యమైన ఉచిత విద్యను రాష్ట్రంలో అందిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెలుతున్నారన్నారు. గంభీరావుపేటలో నిర్మించిన ఈ క్యాంపస్‌కు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును పెడుతున్నట్లు చెప్పారు.
సబ్బండ వర్గాల పిల్లలకు మెరుగైన సదుపాయాలతో ఒకే చోట కేజీ టూ పీజీ ఉచిత విద్య అందించాలనే సీఎం శ్రీ కేసీఆర్ సంకల్పం సాకారమయ్యింది.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 1, 2023
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "మన ఊరు - మన బడి" కార్యక్రమం కింద గంభీరావుపేట్ లో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది. pic.twitter.com/nFJTAgmgJW
రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారు పనులు చేయరన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమం కంటి వెలుగు అని చెప్పారు. సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమం కంటి వెలుగు అని చెప్పారు.
గంభీరావుపేటలో ఆరెకరాల విస్తీర్ణంలో ఆధునిక సముదాయం నిర్మాణమైంది. రహేజా కార్ప్ ఫౌండేషన్, మైండ్‌స్పేస్ రిట్, యశోద హాస్పిటల్, ఎమ్మార్‌ఎఫ్, డీవీస్ ల్యాబ్, గివ్ తెలంగాణ, గ్రీన్‌కో సహకారంతో రూ.3కోట్లతో సకల వసతులతో దీనిని నిర్మించారు. మొత్తం 70 తరగతి గదుల్లో 3500 మంది తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో అభ్యసించేందుకు ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్ హబ్‌లా నిర్మాణాలు పూర్తి చేశారు.