ఇవాల్టి నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన
Minister KTR foreign tour from today.తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ నేటి(మంగవారం) నుంచి విదేశీ పర్యటనకు
By తోట వంశీ కుమార్ Published on
17 May 2022 2:28 AM GMT

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ నేటి(మంగవారం) నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా పది రోజుల పాటు మంత్రి కేటీఆర్ లండన్, స్విజ్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. నేటి ఉదయం 10 గంటలకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ వినానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరనున్నారు.
లండన్‌లో మూడు రోజుల పాటు మంత్రి పర్యటించనున్నారు. ఈ సమయంలో వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీ అవుతారు. అక్కడి నుంచి స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థికవేదిక సద్సులో మంత్రి పాల్గొననున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. తిరిగి ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారుల బృందం వెళ్లనున్నారు.
Next Story